విజయవాడ, 23 సెప్టెంబర్ (హి.స.) ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయిత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఈరోజు (మంగళవారం) పలువురు మంత్రులు దర్శించుకున్నారు. హోం మినిస్టర్ వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత, యార్లగడ్డ వెంకట్రావు దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం మంత్రులు వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని మంత్రులకు ఆలయ అధికారులు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి