తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. అతి తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం
తిరుమల, 23 సెప్టెంబర్ (హి.స.) దసరా సెలవులు మొదలైనా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గడం విశేషం. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ మంగళవారం (సెప్టెంబర్ 23) మాత్రం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి సర్వద
తిరుమల


తిరుమల, 23 సెప్టెంబర్ (హి.స.)

దసరా సెలవులు మొదలైనా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గడం విశేషం. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ మంగళవారం (సెప్టెంబర్ 23) మాత్రం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనం 8 గంటల్లో జరుగుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటలు, రూ.300 శీఘ్ర దర్శనానికి 1-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

నిన్న (సోమవారం) స్వామివారిని 60,681 మంది భక్తులు దర్శించుకోగా.. 19,510 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande