భారత్ తో మ్యాచ్ అంటేనే భయమేస్తుంది.. పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ 2025లో భారత్- పాక్ తల పడనున్న క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియాతో మ్యాచ్ అంటే తమపై తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లను మళ్లీ పునరావృతం కాకుండా చూ
పాకిస్తాన్ కెప్టెన్


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)

ఆసియా కప్ 2025లో భారత్-

పాక్ తల పడనున్న క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియాతో మ్యాచ్ అంటే తమపై తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లను మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇండియా- పాక్ మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో హైటెన్షన్ ఉంటుంది.. క్రికెటర్లపైనా బాగా ఒత్తిడి ఉండటం కామన్.. భారత్తో ఆడిన గత రెండు మ్యాచుల్లో మేం చాలా పొరపాట్లు చేయడంతోనే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తక్కువ తప్పులు చేసిన టీం గెలుస్తుంది.. తప్పకుండా ఈ ఫైనల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని సల్మాన్ అఘా వెల్లడించారు.

ఇక, టీమిండియా ఏం చేయాలనుకుంటే అదే చేయనివ్వండి.. మేం మాత్రం ఏసీసీ ప్రోటోకాల్ను ఫాలో అవుతామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపారు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని వస్తే మేం ముందడుగు వేస్తాం.. లేకపోతే లేదన్నారు. మా చేతుల్లో ఉండే వాటిపైనే మేము ప్రధానంగా దృష్టి పెడతాం.. మీడియాలో వచ్చేవి, బయట అనుకునే వాటిని లైట్ తీస్కుంటాం.. మా లక్ష్యం ఆసియా కప్ గెలవడం మాత్రమే అన్నారు. అయితే, అండర్ -16 రోజుల నుంచి నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను.. గత 20 ఏళ్లలో మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా ఉండటం నేనెప్పుడూ చూడలేదని సల్మాన్ అన్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande