హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
: మూసీ వరద ఉద్ధృతి తగ్గడంతో ఎంజీబీఎస్ తేరుకుంది. ఉదయం నుంచి ఆర్టీసీ సిబ్బంది ఇక్కడ పేరుకుపోయిన బురదను తొలగించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బస్‌స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడుతోంది.
శనివారం ఎంజీబీఎస్‌ను వరద ముంచెత్తడంతో ఇక్కడి నుంచి వెళ్లే బస్సు సర్వీసులను ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల నుంచి నడిపారు. ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి జిల్లాలకు బస్సులు నడిచాయి. ప్రస్తుతం బస్సు సర్వీసులు ఎంజీబీఎస్ నుంచే ప్రారంభించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Telangana News)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ