హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద, మట్టి మిగిలింది. బస్టాండ్లో ప్లాట్ఫారం 56, 58, 60 వద్ద భారీగా బురద పేరుకుపోయింది. మరోవైపు ఎంజీబీఎస్ మార్గంలోని శివాజీ బ్రిడ్జ్ పై కూడా బురత పేరుకోయింది. సిబ్బంది బురదను తొలగిస్తున్నారు. బురదను తొలగించాక మధ్యాహ్నం నుంచి ఎంజీబీఎస్ లోకి బస్సులను అనుమతించే అకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి వచ్చే బస్సులను సిబ్బంది సీబీఎస్ వద్ద నిలిపి ఉంచారు. భారీ వరదతో ఎంజీబీఎస్ ను శనివారం ఉదయం అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి, వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ క్రాస్రోడ్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్ నుంచి, మహబూబ్నగర్, కర్నూలు, బెంగళూరు వైపు బస్సులను ఆరంఘర్ నుంచి నడుతుపుతున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు