రేవంత్ రెడ్డి అహంభావం వల్లే రాష్ట్రానికి 15 వేల కోట్ల నష్టం: కేటీఆర్
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏకపక్షంగా ఎయి
కేటీఆర్


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏకపక్షంగా ఎయిర్పోర్టు మెట్రోలైన్ను రద్దు చేశారని, అక్రమ కేసులు పెడుతామని ఎల్ అండ్ టీని బెదిరించారని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసం ఎల్ అండ్ టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. అందుకే ఆ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నదని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం చేతకానితనంతోనే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ద్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంటు నిలిచిపోయిందని, ఆరోగ్య శ్రీ పథకం స్తంభించిందని, ఆరు గ్యారంటీలు అటకెక్కాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

'రేవంత్ రెడ్డి చేతకానితనం, మితిమీరిన అహంభావం వల్ల రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పింది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తీసుకుంటామన్న ప్రభుత్వ నిర్ణయంతో పౌరులపై రూ.15 వేల కోట్ల భారం పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం, అనవసరపు అహంభావం వల్ల తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande