హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనపై తెలుగు సినీ పరిశ్రమ సీనియర్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాను ప్రగాడ సానుభూతి తెలుపుతున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు