లండన్లో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించిన ఇండియన్ హైకమిషన్
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) బ్రిటన్ రాజధాని లండన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్లోని టావిస్టాక్ స్వ్కేర్లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. టెర్రరిస్టు, గాంధీ-మోదీ హిందుస్థాన
గాంధీ విగ్రహం


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

బ్రిటన్ రాజధాని లండన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్లోని టావిస్టాక్ స్వ్కేర్లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. టెర్రరిస్టు, గాంధీ-మోదీ హిందుస్థాని టెర్రరిస్టులని నల్ల రంగుతో విగ్రహంపై రాశారు.

మహాత్ముని జయంతికి మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దీనిని సిగ్గుమాలిన చర్యగా పేర్కొంది. దీనిని అహింస వారసత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. మహాత్ముని విగ్రహాన్ని పూర్వ రూపంలోకి తీసుకు వచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపింది.

మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేయడంపాటు తీవ్రంగా ఖడిస్తున్నామని ఎక్స్ వేదికగా వెల్లడించింది. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి సరిగ్గా మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం ధ్వంసం మాత్రమే కాదని, అహింస భావనపై, మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి అని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande