హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్కే సాధ్యమని బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ . రిజర్వేషనులు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పారు.. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, బీ ఆర్ఎస్ ఒకటేనని ఈ రెండు పార్టీలు కలిసే సంసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎఎస్ ఒక్కటై కుట్ర పూరితంగా కాంగ్రెస్పై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్ రేస్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్ ల బండారం ఒక్కొక్కటి బయట పడుతుండడంతో దిక్కుతోచక 'బాకీ కార్డు' పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..