తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఇక నుండి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్..
హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయిన ''తెలుగుతల్లి ఫ్లైఓవర్'' పేరును ''తెలంగాణ తల్లి ఫ్లైఓవర్''గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఫ్లైఓ
తెలంగాణ తల్లి


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.) నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయిన

'తెలుగుతల్లి ఫ్లైఓవర్' పేరును 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్'గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఫ్లైఓవర్పై తెలంగాణ తల్లి అని వచ్చేలా నూతన సూచిక బోర్డులను పెట్టారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్కు ఇకపై 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్' అని పేరు మార్చగా.. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించి 'తెలుగుతల్లి ఫ్లైఓవర్'గా నామకరణం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande