తిరుమల శ్రీవారికి భారీ విరాళం..డీడీ రూపంలో కళ్లు చెదిరే మొత్తం.. ఎంతంటే!
తిరుమల, 5 సెప్టెంబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున
తిరుమల


తిరుమల, 5 సెప్టెంబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. కలియుగ వైకుంఠ నాథుడు తన భక్తులందరినీ నిలువు దోపిడీ చేస్తాడని అంటారు. అటువంటి స్వామివారికి భక్తులు డబ్బులు, బంగారం, వెండి వంటి కానుకలను హుండీలో వేస్తారు. మరికొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు అందజేస్తారు. ఈ విరాళాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. తాజాగా ఒక భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు.. పేదవారు, భక్తుల ప్రాణాలు కాపాడే కీలకమైన ప్రాణదాన ట్రస్టు కోసం ఇచ్చారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వెలివెన్నుకు చెందిన శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.01కోట్ల భారీ విరాళాన్ని వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సమర్పించింది. ఈ మేరకు శశి ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ రవికుమార్‌ బురుగుపల్లి సంస్థ తరఫున విరాళం డీడీని అందించారు. అనతరం విరాళం అందజేసిన దాత రవికుమార్ దంపతులను టీటీడీ ఛైర్మన్ అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande