అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)కు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఐదేళ్లపాటు మంత్రిగా వ్యవహరించిన ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు (Allegations of corruption) వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అంబటిపై విజిలెన్స్ విచారణ (Vigilance investigation)కు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా.. జగనన్న కాలనీల కోసం భూములను ఎకరం రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు రూ.7 లక్షలకు అమ్మినట్లు తెలుస్తుంది. అంబటి అవినీతి ఆరోపణలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు (Govt orders) జారీ చేసింది. ఈ విజిలెన్స్ నివేదికలో అక్రమాలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తే.. ఈ కేసును ఏపీ ప్రభుత్వం (AP Govt) ఏసీబీకి అప్పగించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి