అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)
నందిగామ: ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది ( ద్విచక్ర వాహనంపై మాస్కులు వేసుకుని వచ్చిన ఇద్దరు దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. గుర్రం మనోహరి అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆమె మెడలోని 100 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని వెళ్లారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ