అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డెక్కెన్ రెమెడీస్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద గ్యాస్ లీకై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు నాయుడుని గాజువాక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాయుడు మృతి చెందాడు. పరవాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ