తిరుమల, 8 సెప్టెంబర్ (హి.స.)రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుద్ధి, సుప్రభాతసేవ, స్వామివారికి పూజా కైంకర్యాల నిర్వహణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తోంది టీటీడీ.
గ్రహణానంతరం తిరుమల ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 27,410 మంది భక్తులు దర్శనం చేసుకోగా.. హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి