
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే
సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లి అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ జట్టుపై వన్డేల్లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ 1 స్థానానికి దూసుకు వెళ్ళాడు కోహ్లి. మొన్న న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించాడు కోహ్లి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ వెనక్కి నెట్టి, నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి ప్లేస్ కు చేరుకున్నాడు కింగ్ కోహ్లి. అదే సమయంలో రెండవ స్థానానికి న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ చేరుకున్నాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..