అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. వందలాది వాహనాలు ఢీ, రహదారులు మూసివేత
హైదరాబాద్, 20 జనవరి (హి.స.) అమెరికాలో తీవ్ర మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మిచిగాన్ రాష్ట్రంలో కురిసిన భారీ మంచు కారణంగా రహదారులు జారిపోవడంతో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌స్టేట్–196 (I-196)పై 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీక
మంచు తుఫాను


హైదరాబాద్, 20 జనవరి (హి.స.)

అమెరికాలో తీవ్ర మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మిచిగాన్ రాష్ట్రంలో కురిసిన భారీ మంచు కారణంగా రహదారులు జారిపోవడంతో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌స్టేట్–196 (I-196)పై 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొన్ని వాహనాలు నియంత్రణ తప్పి రహదారి నుంచి బయటకు జారిపోయాయి. ప్రమాదాల నేపథ్యంలో మిచిగాన్ స్టేట్ పోలీసులు I-196ను రెండు దిశల్లో పూర్తిగా మూసివేశారు. రహదారిపై చిక్కుకుపోయిన వాహనాలను తొలగించేందుకు భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. 30కి పైగా సెమిట్రైలర్ ట్రక్కులతో సహా అన్ని వాహనాలను క్రమంగా తొలగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande