
అమరావతి, 21 జనవరి (హి.స.)
, అమరావతి: గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ఎన్‌హెచ్ అధికారులు గుత్తేదారుకు లక్ష్యం నిర్దేశించారు. 2025 డిసెంబరు 31 నాటికి 10 శాతం లక్ష్యానికి 11.57శాతం పూర్తయ్యాయి.
ఈ మార్గంలో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరగడం, అందుకు అనుగుణంగా రహదారి విస్తరణ జరగకపోవడంతో వరుసగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించి 167ఏజీ నంబరును కేటాయించింది. ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించింది. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి లక్ష్యం మేర జరిగేలా చూస్తున్నామని జాతీయరహదారుల సంస్థ కార్యనిర్వాహక ఇంజినీరు ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.
రహదారి విస్తరణ పూర్తయితే..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ