రేపటి.తో ముగియనున్న సీఎం.చంద్రబాబు దావోస్ పర్యటన
అమరావతి, 21 జనవరి (హి.స.) అమరావతి/ దావోస్ : భారత్ - ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ - టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం దావోస్‌లో ఇజ్ర
రేపటి.తో ముగియనున్న సీఎం.చంద్రబాబు దావోస్ పర్యటన


అమరావతి, 21 జనవరి (హి.స.)

అమరావతి/ దావోస్ : భారత్ - ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ - టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం దావోస్‌లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బార్కాట్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇజ్రాయెల్‌తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, యూఏవీ రంగాల్లో భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు. అలాగే సెమీ కండక్టర్, క్వాంటమ్ టెక్నాలజీలో సహకార అవకాశాలతో పాటు నీటి శుద్ధి, భూగర్భ జలాల నాణ్యతపై ఇజ్రాయెల్ నైపుణ్యం, వినియోగంపైనా చర్చించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అదే విధంగా.. మెడికల్, విద్య, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల రూపకల్పనపై చర్చించామని వివరించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన సహా ఏపీని మెడ్ - టెక్, ఏరో - డిఫెన్స్ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యం దిశగా అడుగులు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తయారీకి ఇజ్రాయెల్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలపై సైతం ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించామని చంద్రబాబు తెలిపారు.

రేపటితో ముగియనున్న సీఎం పర్యటన..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande