హైదరాబాదులో ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 21 జనవరి (హి.స.) దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఆయా రంగాల్లో పలు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ముందుకు వచ్చాయి. ఎంవోయూలు
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 21 జనవరి (హి.స.)

దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఆయా రంగాల్లో పలు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ముందుకు వచ్చాయి. ఎంవోయూలు చేసుకున్న కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్లో భారీ పెట్టుబడులతో బ్యూటీ-టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande