రిపబ్లిక్ డే” రోజు పెద్ద ఎత్తున దాడులకు పాకిస్తాన్, జైష్ కుట్ర..
హైదరాబాద్, 21 జనవరి (హి.స.)రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంద
రిపబ్లిక్ డే” రోజు పెద్ద ఎత్తున దాడులకు పాకిస్తాన్, జైష్ కుట్ర..


హైదరాబాద్, 21 జనవరి (హి.స.)రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ కుట్రకు ‘‘26-26’’ అని కోడ్ నేమ్ పెట్టినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు అల్ ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెట్(AQIS) ఉగ్రవాది, ఢిల్లీకి చెందిన మహ్మద్ రెహాన్ ఫోటోలతో వాంటెడ్ జావితాను విడుదల చేసింది. ఇదే కాకుండా, బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సూత్రధారిగా భావిస్తున్న షాహిద్ ఫైసల్‌ పేరును కూడా నోటీసుల్లో చేర్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande