అటల్ పెన్షన్ యోజన.. మరో ఐదేళ్లు పొడిగింపు
ఢిల్లీ,21, జనవరి (హి.స.)దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధ
అటల్ పెన్షన్ యోజన.. మరో ఐదేళ్లు పొడిగింపు


ఢిల్లీ,21, జనవరి (హి.స.)దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మే 9, 2015న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన భారత సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. అధికారిక పెన్షన్ సౌకర్యం లేని సామాన్యులను పెన్షన్‌ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. తాజా గణాంకాల ప్రకారం జనవరి 19, 2026 నాటికి ఈ పథకం కింద నమోదైన చందాదారుల సంఖ్య 8.66 కోట్లకు పైగా చేరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande