
ఢిల్లీ,21, జనవరి (హి.స.) ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో మిలిటరీ శిక్షణ విమానం (microlight aircraft) కూలింది. సాధారణ శిక్షణలో ఉండగా.. స్థానిక కేపీ కాలేజీ సమీపంలోని చెరువులో ఆర్మీ విమానం కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు