తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
అమరావతి, 22 జనవరి (హి.స.) : తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది


అమరావతి, 22 జనవరి (హి.స.)

: తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఇవాళ ఆన్లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. నిన్న (జనవరి 21) శ్రీవారిని మొత్తం 74,056 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,517 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజున హుండీ ద్వారా రూ. 3.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande