
బెంగళూరు, 22 జనవరి (హి.స.)ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం చిన్నపిల్లల వరకు విస్తరించింది. పిల్లలు అల్లరి చేస్తున్నారని, భోజనం చేయడం లేదని, లేదా తల్లిదండ్రుల పనులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చాలామంది పిల్లల చేతుల్లో ఫోన్లు పెడుతున్నారు. అయితే ఈ అలవాటు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోందని బెంగళూరు అబ్బిగేరికి చెందిన నిపుణులు డాక్టర్ మంజుళ వి హెచ్చరిస్తున్నారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను ఆడించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్‌గా మారిపోయింది. ఆఫీస్ పని ఒత్తిడిలోనో లేక కాసేపు ప్రశాంతంగా ఉండాలనో చాలామంది పేరెంట్స్ చేస్తున్న పని.. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం. దీనినే నిపుణులు స్క్రీన్ బ్రైబ్ లేదా డిజిటల్ లంచం అని పిలుస్తున్నారు. అయితే ఈ చిన్న అలవాటు మీ పిల్లల ఎదుగుదలను నిలువునా దహించి వేస్తోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పిల్లలు మారాం చేసినప్పుడు లేదా వారు ఏడుస్తున్నప్పుడు వారిని శాంతింపజేయడానికి ఫోన్ ఇవ్వడాన్ని స్క్రీన్ బ్రైబ్ అంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో పిల్లలను మానసిక రోగులుగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి అత్యంత విలువైన 4 విషయాలను దొంగిలిస్తున్నట్లే లెక్క.
మాటలు రావడం ఆలస్యమవుతోంది
పిల్లలు ఇతరులతో మాట్లాడితేనే భాష వస్తుంది. కానీ ఫోన్‌కు అలవాటు పడిన పిల్లలు కేవలం వినడానికే పరిమితం అవుతున్నారు. దీంతో వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. నేటి కాలంలో చాలామంది పిల్లల్లో స్పీచ్ డిలే అంటే మాటలు ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం ఇదే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV