
తిరుమల, 03 జనవరి (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు ట్రస్టులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ రూ.3 కోట్లు విరాళం అందజేశారు. సంబంధిత డీడీని తితిదే పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు అందజేశారు. విరాళం అందించడంపై దాతను ఈవో సింఘాల్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ