
అండమాన్ , 03 జనవరి (హి.స.)
కేంద్రమంత్రి బండి సంజయ్
అండమాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కలాపాని జైలును సందర్శించారు. జైలులో వీర సావర్కర్ సెల్ లోకి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. అంతే కాకుండా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్, వైపర్ దీవులను ఆయన తిలకించారు. అనంతరం జైలులో ఏర్పాటు చేసిన వీరుల పోరాట గాథల లైట్ అండ్ సౌండ్ షోలో పాల్గొన్నారు. పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కొన్ని ప్రదేశాలు మిమ్మల్ని మార్చకుండా వెళ్లనివ్వవు అంటూ కామెంట్ చేశారు. సుభాష్ చంద్రబోస్ ద్వీపం, వైపర్ ద్వీపాల గుండా వెళుతున్నప్పుడు మాటల కంటే నిశ్శబ్దమే బిగ్గరగా అనిపించిందని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..