
అచ్యుతాపురం, 03 జనవరి (హి.స.)
: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌వీఎస్ కంపెనీలో ప్రమాదవశాత్తూ మంటలు రేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 14 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ