చెప్పినట్లు వినకపోతే నీకు అదే గతి.. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ బాధ్యతలు చేపట్టగానే అమెరికా చర్యలను తప్పుపట్టారు. మదురోను నిర్బంధించడం సరికాదని, వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. వెనిజులా
ట్రంప్ వార్నింగ్


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ బాధ్యతలు చేపట్టగానే అమెరికా చర్యలను తప్పుపట్టారు. మదురోను నిర్బంధించడం సరికాదని, వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. వెనిజులా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ రోడ్రిగ్జా సుముఖంగా ఉండాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందన్నారు. వెనిజులాపై అమెరికా నియంత్రణకు అంగీకరించాల్సిందేనని.. అప్పుడే ఆ దేశాన్ని పునర్నిర్మించగలమని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande