
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,05జనవరి (హి.స.) దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Delhi riots case)లో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే, ఇదే కేసులో నిందితులైన మరో ఐదుగురికి మాత్రం సుప్రీం (Supreme Court) ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
‘‘ఈ కుట్ర కేసు (Delhi riots case)లో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలున్నాయి. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు భిన్నమైనవి. ఇలాంటి దశలో వారికి బెయిల్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదు’’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్లలో 53 మంది దుర్మరణం చెందగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కూడా హత్యకు గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ