
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
సోమనాథ్/ఢిల్లీ.,05జనవరి (హి.స.).. ఈ పేరు తలచుకుంటే చాలు మన హృదయాలు, మనసులలో సగర్వభావన నిండిపోతుంది. భారత ఆత్మకు ఇదో శాశ్వత ఉద్ఘోషణ. పశ్చిమతీరంలో గుజరాత్‌లో ప్రభాస్ పాటణ్ వద్ద ఈ మహత్తర ఆలయం కొలువైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. ‘సౌరాష్ట్రే సోమనాథం చ’ అని మొదలయ్యే స్తోత్రం.. తొలి జ్యోతిర్లింగంగా దీనికున్న ప్రాధాన్యానికి ప్రతీక. సోమనాథ్ శివలింగ దర్శనంతో పాప ప్రక్షాళన జరుగుతుందని, మరణానంతరం స్వర్గానికి చేరుతారని ‘సోమలింగం నరో దృష్ట్యా సర్వపాపైః ప్రముచ్యతే! లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్!!’ శ్లోకం మనకు చెబుతుంది. లక్షల మంది భక్తుల నీరాజనాలు అందుకున్న సోమనాథ్‌పై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశారు. ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై గజనీ మహమ్మద్ క్రూర, హింసాత్మక దండయాత్ర చేసింది 1026 జనవరిలోనే. ఆలయానికి పూర్వవైభవం దిశగా అప్రతిహతంగా సాగిన కృషివల్ల వెయ్యేళ్ల తర్వాత కూడా ఆలయ దివ్యదీప్తి నేల నలుచెరగులా భాసిల్లుతోంది. ఇలాంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తవుతుంది. ఆలయ పునరుద్ధరణ తర్వాత 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శనభాగ్యం కలిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ