
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
కోల్‌కతా, 05,జనవరి (హి.స.): ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దాడిని మరింత పెంచారు. ‘ఏకపక్షంగా, లోపభూయిష్టంగా’ ఉన్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) కసరత్తును రాష్ట్రంలో నిలుపుచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుత రూపంలో దీనిని కొనసాగిస్తే అనేకమంది తమ ఓటుహక్కును కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పునాదులపైనే ఇదొక దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఘాటైన పదజాలంతో సీఈసీకి లేఖ రాశారు. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో, తీవ్ర అవకతవకలతో, విధాన ఉల్లంఘనలతో, పరిపాలనా లోపాలతో సర్‌ను ఈసీ కొనసాగిస్తోందని విరుచుకుపడ్డారు. ఇదివరకే తాను రెండు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని చెప్పారు. అందువల్లే తన ఆందోళనను తెలిపేందుకు మరో లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని చెప్పారు. సరిదిద్దలేనంత నష్టం జరగడానికి ముందే ఈ కసరత్తును ఆపాలని విజ్ఞప్తిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ