పాసు పుస్తకాల. పంపిణీలో నిర్లక్షం పై ముఖ్యమంత్రి.చంద్రబాబు సీరియస్
రాజమహేంద్రవరం, 09 జనవరి (హి.స.) :పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన
పాసు పుస్తకాల. పంపిణీలో నిర్లక్షం పై ముఖ్యమంత్రి.చంద్రబాబు సీరియస్


రాజమహేంద్రవరం, 09 జనవరి (హి.స.)

:పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై సీఎం మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో పారదర్శకత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande