7.83 లక్షల మంది.వైకుంఠ ద్వారా దర్శనాలు.చేసుకున్నారు
తిరుమల, 09 జనవరి (హి.స.) : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని తితిదే ఛైర్మన్‌ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్ర
7.83  లక్షల మంది.వైకుంఠ ద్వారా  దర్శనాలు.చేసుకున్నారు


తిరుమల, 09 జనవరి (హి.స.)

: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని తితిదే ఛైర్మన్‌ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుమలలో అత్యంత వైభవంగా వైకుంఠద్వార దర్శనాలు నిర్వహించినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తితిదే కల్పించిన ఏర్పాట్లపై 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ మేరకు తిరుమలలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదునపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, తితిదే సీవీఎస్‌వో మురళీకృష్ణతో కలిసి బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande