
అమరావతి, 09 జనవరి (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలంటూ ఆ లేఖలో సీఎం చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆ లేఖలో జంగా వివరించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ