
హైదరాబాద్ , 10 అక్టోబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాన్ని ఎన్నుకునేందుకు నిర్వహించిన ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 34,905 మంది ఉద్యోగుల్లో 34,182 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. 97 డిపోల పరిధిలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 99 శాతం, హైదరాబాద్ పరిధిలో 98 శాతం, కరీంనగర్ పరిధిలో 97 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్