
హైదరాబాద్ , 10 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో వర్షపాతం తగ్గడం, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్టోబర్ 12న ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వయించనున్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, విద్యుత్ డిమాండ్, కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రానికి సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారుల వివరాలను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. మొత్తం 612 మండలాల్లో 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంది.
వర్షపాతం తగ్గినప్పుడు వ్యవసాయంపై ప్రభావం పడటమే కాకుండా చెరువులు, జలాశయాలు, భూగర్భజలాల లభ్యతపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిర్వహించడం కూడా సవాలుగా మారవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్