విజయవాడలో విద్యుత్ కారులో మంటలు — నలుగురు మృతి
విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రాంతంలో విద్యుత్ కారుకు సంబంధించిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.
Accident


అమరావతి , 13 అక్టోబర్ (హి.స.)విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రాంతంలో విద్యుత్ కారుకు సంబంధించిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. అక్టోబర్ 12 అర్ధ రాత్రి కారు రహదారి పక్కనున్న రక్షణ గోడను ఢీకొన్న అనంతరం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. బాధితులు గుంటూరులోని ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande