తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై టీజీఆర్ఎస్ఏ కీలక నిర్ణయాలు: రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై టీజీఆర్ఎస్ఏ కీలక నిర్ణయాలు: రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
tgrsa


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించబడింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అధ్యక్షతన మరియు గౌరవ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి ప్రత్యేక సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని ఉద్యోగుల పదోన్నతులు, ఖాళీల భర్తీ, బదిలీల ప్రక్రియ మరియు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించడం వంటి ప్రధాన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు భూపరిపాలనలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వంతో చర్చలు జరిపి రెవెన్యూ సిబ్బంది న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ప్రత్యేక వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande