
జగిత్యాల , 14 అక్టోబర్ (హి.స.)జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు (ఆనంద్, సంజీవ్) ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సమయంలో బావి ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు భావిస్తున్నారు.
కుటుంబ సభ్యులు వెతకగా, ఇవాళ ఉదయం వారి మృతదేహాలు బావిలో తేలడంతో గ్రామంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్