విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు: ఎస్పీ మహేష్ బి.గితే
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హెచ్చరించారు.
Sp


రాజన్న సిరిసిల్ల, 16 అక్టోబర్ (హి.స.)

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హెచ్చరించారు. విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వ్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎస్ఐ శ్రీకాంత్‌పై వచ్చిన థర్డ్ డిగ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఆరోపణల నేపథ్యంలో ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసేందుకు డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.. విచారణ పారదర్శకంగా జరిగేలా ఎస్ఐ శ్రీకాంతన్ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. విచారణ అధికారి సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande