
భద్రాద్రి కొత్తగూడెం, 19 అక్టోబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద గల గోదావరి ఆనకట్టను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గోదావరి నీళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటాయని, తక్కువ నీటి వినియోగం ఉండే పంటలు సాగు చేయాలని తుమ్మల రైతులకు పిలుపునిచ్చారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గడం నీటి కొరత వల్ల రైతులు వరి సాగు చేయొద్దని సూచించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో 50 డిగ్రీలు ఎండలు దాటే అవకాశం ఉందని, తాగునీటి కష్టాలు లేకుండా గోదావరి నీళ్లను నిల్వ చేయాలని సీఎంకు వివరించానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు