తాము అధికారంలోకి వచ్చాక రైతన్నలకు సంపూర్ణ మేలు.. టిఆర్ఎస్ చీఫ్ కవిత.
కరెంట్ ఇవ్వకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా రైతాంగానికి నష్టం చేకూరుస్తే ఊరుకోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Kavita


కాళేశ్వరం, 19 అక్టోబర్ (హి.స.)

కరెంట్ ఇవ్వకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా రైతాంగానికి నష్టం చేకూరుస్తే ఊరుకోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నలకు సంపూర్ణ మేలు చేస్తాం. అప్పటి వరకు ప్రభుత్వంతో నిరంతరం కొట్లాడుతాం' అని ఆమె తేల్చిచెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కన్నెపల్లి పంపు హౌజ్ను కవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రవహిస్తున్న గోదావరి నీటిని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువు కాలంలోనూ 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, కాపర్ డ్యామ్ను 93 మీటర్ల పొడవునా నిర్మిస్తే మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని లిఫ్ట్ చేయవచ్చని కవిత స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒక లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడిందని కవిత తెలిపారు. కరువు పరిస్థితుల వల్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ బండారం బయటపడిందని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande