నేడు హైదరాబాదులో తెలంగాణ బిజెపి కీలక సమావేశం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అధ్యక్షతన హైదరాబాద్లో నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది.
Bjp


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అధ్యక్షతన హైదరాబాద్లో నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఉండగా బిజెపి జాతీయ నాయకుడు సునీల్ బన్సాల్ ఇప్పటికే హైదరాబాద్లోనే మకాం వేశారు. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande