'ఆర్నబ్' తీరప్రాంత ప్రయాణం ముగింపు దశకు: మరో 1 నుంచి 3 గంటల్లో పూర్తి కానున్న ల్యాండ్ఫాల్ - వాతావరణ శాఖ డైరెక్టర్ మూర్తి వెల్లడి
'ఆర్నబ్' తీరప్రాంత ప్రయాణం ముగింపు దశకు: మరో 1 నుంచి 3 గంటల్లో పూర్తి కానున్న ల్యాండ్ఫాల్ - వాతావరణ శాఖ డైరెక్టర్ మూర్తి వెల్లడి
యానాం


అమరావతి:, 28 అక్టోబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికిస్తున్న 'ఆర్నబ్' తీవ్ర తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాకినాడ - యానాం తీర ప్రాంతాల వెంబడి కొనసాగుతున్న ఈ తుఫాను ప్రభావం మరో ఒకటి నుంచి మూడు గంటల్లో పూర్తిగా ముగియనుందని వాతావరణ శాఖ డైరెక్టర్ మూర్తి తెలిపారు. తుఫాను తీరం దాటే క్రమంలో తీరప్రాంత జిల్లాల్లో గంటకు అత్యధిక వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, రాగల కొన్ని గంటల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ల్యాండ్‌ఫాల్ కొనసాగుతున్న తరుణంలో కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 120 నుండి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande