
నెల్లూరు , 30 అక్టోబర్ (హి.స.)
నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులపై దాడులకు తెగబడింది. వరుసగా 16 మంది గ్రామస్తులను కరిచి తీవ్రంగా గాయపరచడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితులను కలువాయి, పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి రేబీస్ నిరోధక టీకాలు అందించారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్