హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును ప్రకటించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును ప్రకటించిన కల్వకుంట్ల కవిత
Kavitha


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత కల్వకుంట్ల కవిత అధికారికంగా ఖరారు చేశారు.

గతంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను బరిలోకి దింపిన కవిత, ఇప్పుడు హైదరాబాద్ స్థానానికి కూడా బీసీ వర్గానికి చెందిన ఆకాశ్ కొల్లూరును ఎంపిక చేసి రెండు చోట్లా బీసీలకే అవకాశం కల్పించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన ఆకాశ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్‌ సాధించడంతో పాటు జాతీయ మీడియాలో సుమారు రెండు దశాబ్దాల పాటు సేవలు అందించారు.

ఈ ఎన్నికల నిర్వహణ కోసం హైదరాబాద్ నియోజకవర్గ అబ్జర్వర్‌గా డాక్టర్ చిట్నేని రఘును, ప్రచార వ్యూహాలు మరియు వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లాను పార్టీ అధినేత నియమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande