నకిలీ పీజీ పట్టాలతో ప్రభుత్వ ఉద్యోగాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లు డిస్మిస్
నకిలీ పీజీ పట్టాలతో జూనియర్ లెక్చరర్ పోస్టులు పొందిన 35 మందిపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ తాజాగా వేటు వేసింది.
Fake certificate


హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.)

నకిలీ పీజీ పట్టాలతో జూనియర్ లెక్చరర్ పోస్టులు పొందిన 35 మందిపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ తాజాగా వేటు వేసింది. ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న జూనియర్ లెక్చరర్ల వ్యవహారంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది. వీరికి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 2014 కంటే ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్న సుమారు 3300 మందిని 2023లో రెగ్యులరైజ్ చేశారు. వీరిలో కొంత మంది ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చదివినట్లు సర్టిఫికేట్లు సమర్పించారు. అయితే వీరు సమర్పించిన పీజీ సర్టిఫికేట్లు అసలైనవేనా కాదా అని తెలుసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు స్వయంగా సదరు విశ్వవిద్యాలయాలను సందర్శించి పరిశీలించారు. ఈ సదరు ఉద్యోగులు సమర్పించిన పీజీ ధృవపత్రాలు నకిలీవని తేలడంతో వారిపై ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande