
హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.)
బొల్లారం డివిజన్ ఇకపై ఎడ్యుకేషన్
హబ్గా మారనుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు బొల్లారం నుంచి తొలి అడుగు పడిందని తెలిపారు. జిన్నారం మండలం బొల్లారం డివిజన్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలో క్యూర్ అర్బన్ రీజియన్ స్కూల్స్లో భాగంగా రూ.19.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన పాఠశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వారు
మాట్లాడుతూ.. నూతన పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన ఆధునిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్యతో పాటు ఆధునిక వసతులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..