
పెద్దపల్లి, 05 అక్టోబర్ (హి.స.) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ద్వారా అవసరమైన సమాచారం, సహకారం అందించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి సూచించారు. సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హెల్ప్ డెస్క్ ను ఎన్నికల రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ లో ఓటర్లకు అందిస్తున్న సేవలు, స్వీకరిస్తున్న దరఖాస్తులు, నోటీసుల పరిశీలన, అవసరమైన పత్రాల వివరాలను వారు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్టోరోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చే ఓటర్లకు దరఖాస్తుల విధానం, అవసరమైన పత్రాలు, నోటీసులకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు